Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తపాలా బిళ్లల మీద ప్రఖ్యాత వంటకాలు... స్టాంపులు విడుద‌ల చేసిన భార‌త త‌పాలా శాఖ‌!

  • 24 త‌పాలా బిళ్ల‌లు విడుద‌ల చేసిన ఇండియా పోస్ట్‌
  • బిర్యానీ, తిరుప‌తి ల‌డ్డు, సేవియా, బ‌గారా బైంగ‌న్‌ల‌కు స్థానం
  • భార‌త సంప్ర‌దాయ వంట‌ల‌కు ప్ర‌తీక‌గా స్టాంపులు
భిన్న‌త్వంలో ఏక‌త్వంగా క‌లిసి ఉండే భార‌త ప్ర‌జ‌ల ఆహార‌పు అల‌వాట్ల‌లో కూడా చాలా తేడాలు ఉంటాయి. ఆ అల‌వాట్ల‌కు త‌గ్గ‌ట్లుగానే ఆయా ప్రాంతాల వంట‌కాలు మారుతుంటాయి. కొన్ని వంట‌కాలు ప్ర‌త్యేకంగా కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే ల‌భిస్తాయి. అలాంటి వంట‌కాలకు గుర్తింపు నిచ్చేందుకు భార‌త త‌పాలా శాఖ న‌డుం క‌ట్టింది.

అందుకోసం దేశంలో ప్రఖ్యాతి గాంచిన 24 వంట‌కాల‌ను ముద్రించి ఉన్న త‌పాలా బిళ్ల‌ల‌ను విడుద‌ల చేసింది. వీటిలో హైద‌రాబాద్ బిర్యానీ, బ‌గారా బైంగ‌న్‌, సేవియాల‌కు స్థానం ద‌క్కింది. ఇంకా ఈ జాబితాలో ఇడ్లీ దోస‌, బేబీ అప్పం, పొంగ‌ల్‌, మాల్పువ‌, ఠేకువా, తిరుప‌తి ల‌డ్డూ, గుజియా, డోక్లా, దాల్ బ‌టీ, లిట్టి ఛోఖా, మ‌క్కే కీ రోటీ స‌ర్సోంకా సాగ్‌, ఛోలే బ‌టోరే, గోల్‌గ‌ప్పా వంట‌కాలు ఉన్నాయి.
postal stamps
recipies
india
famous
india post
24

More Telugu News